నిండుకుండను తలపిస్తున్న జూరాల ప్రాజెక్టు - నిండుకుండను తలపిస్తోన్న జూరాల
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు 2 లక్షల 62 వేల 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడం వల్ల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.040 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువన ఉన్న శ్రీశైలానికి 2 లక్షల 62 వేల 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.040 మీటర్లుగా ఉంది.
- ఇదీ చూడండి : సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం