జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోని 62 గేట్లకు గాను 60 ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 8.05 లక్షల క్యూసెక్కులుగా... ఔట్‌ఫ్లో 8.30 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. జూరాల కింద లోతట్టు ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. మిరప, వరి, పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. గద్వాల మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు.. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు ఆదివారం అయినందున కృష్ణమ్మ పరవళ్లు వీక్షించేందుకు స్థానికులు, పర్యటకులు భారీగా తరలివచ్చారు.
జూరాలకు పోటెత్తుతోన్న వరద - jurala
కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు జలాశయంలోని 62 గేట్లకు గాను 60 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పోటెత్తుతోన్న వరద
Last Updated : Aug 11, 2019, 1:21 PM IST