తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలకు భారీగా వచ్చి చేరుతోన్న వరద నీరు

జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న నీటితో జలాశయ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Flood waters coming heavily into the jurala
జూరాలకు భారీగా వచ్చి చేరుతోన్న వరద నీరు

By

Published : Aug 23, 2020, 10:47 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 3 లక్షల 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 3,02,166 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల జలాశయం

  • పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం 1,042 అడుగులు
  • పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు

ABOUT THE AUTHOR

...view details