జూరాల వద్ద ఫ్లెమింగ్ బర్డ్స్ సందడి
ప్రాజెక్టు తీరానా... వేసవి సమయానా... ఫ్లెమింగ్ బర్డ్స్ ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. వేసివి విడిదిగా జూరాల ప్రాజెక్టుకు విచ్చేసిన ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
ఫ్లెమింగ్ బర్డ్స్ సందడి
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఫ్లెమింగ్ బర్డ్స్ సందడి చేశాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో... వివిధ రకాల విదేశీ పక్షులు ఇక్కడకు వచ్చి సేద తీరుతున్నాయి. ప్రాజెక్టు వద్ద దొరికే చేపలను తింటూ... ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ఫ్లెమింగ్ బర్డ్స్ జూరాల ప్రాంతానికి వచ్చి సందర్శకులకు కనువిందు కలిగిస్తున్నాయి.