తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం చెట్ల నరికివేత.. ఆసుపత్రి యాజమాన్యానికి జరిమానా - telangana varthalu

ఓ వైపు హరితహారానికి ప్రాధాన్యతనిస్తూ.... ప్రభుత్వం విరివిగా మొక్కలు నాటుతోంది. పచ్చదనం పెంపుకోసం కృషి చేస్తోంది. ఇందుకు భిన్నంగా కొందరు పెరిగిన చెట్లను నరికేస్తున్నారు. తమ ఫ్లెక్సీ కనిపించడం కోసం హరితహారం చెట్లను నరికిన ఆసుపత్రి యాజమాన్యానికి రూ.50వేలు జరిమానా వేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

హరితహారం చెట్ల నరికివేత.. ఆసుపత్రి యాజమాన్యానికి జరిమానా
హరితహారం చెట్ల నరికివేత.. ఆసుపత్రి యాజమాన్యానికి జరిమానా

By

Published : Oct 9, 2021, 5:49 PM IST

హరితహారం చెట్లను నరికిన ఆసుపత్రి యాజమాన్యానికి యాభై వేల రూపాయలు జరిమానా వేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. అయిజ మున్సిపాలిటీలోని ఆర్​ అండ్​ బీ గెస్ట్ హౌస్ సమీపంలో కర్నూల్​కు చెందిన అమీలియో ఆసుపత్రి ఫ్లెక్సీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్ ప్రజలకు కనబడడం లేదని రోడ్డు వెంబడి ఉన్న హరితహారం చెట్లను నరికి వేశారు. ఇది గమనించిన అయిజ మున్సిపల్​ కమిషనర్ ఆసుపత్రి యాజమాన్యానికి రూ.50వేలు జరిమానా వేశారు.

అలాగే నరికిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటాలని ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని కమిషనర్ నరసయ్య​ తెలిపారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి: Crocodile in moosi river: వరదలో కొట్టుకొచ్చిన మొసలి.. తస్మాత్ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details