జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను.. జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం భూమి పూజ చేసి ప్రారంభించారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మానవపాడు మండల కేంద్రంలోని రాజోలి, చిన్నదన్వాడ గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు జడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. త్వరలోనే తుమిళ్ల ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
త్వరలోనే తుమిళ్ల ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజారంజక పాలనే లక్ష్యంగా ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సభ్యులు,ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్