తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరుణుడి కోసం చూడం.. రెండు పంటలు పండిస్తాం'

జోగులాంబ గద్వాల జిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. జిల్లాలో పెరిగిన సాగునీటి వనరులతో వరుణుడి రాకకోసం వేచిచూసే రోజులు పోయాయి. ఎత్తిపోతల పథకాలతో ఇకనుంచి రెండు పంటలు పండిస్తామని రైతన్నలు ధీమావ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 29, 2019, 11:55 PM IST

'వరుణుడి కోసం చూడం.. రెండు పంటలు పండిస్తాం'

'వరుణుడి కోసం చూడం.. రెండు పంటలు పండిస్తాం'

జోగులాంబ గద్వాల జిల్లా రైతులు ఉప్పొంగిపోతున్నారు. పచ్చని పంట పొలాలు చూసి తెగ సంతోషపడుతున్నారు. వలస వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటుంటే సాదర స్వాగతం పలుకుతున్నారు.

జిల్లాలో మొత్తం తొమ్మిది ఎత్తిపోతల పథకాల కింద పదివేల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఉల్లి పంటలను పండిస్తున్నారు. గతంలో వరుణుడి రాకకోసం వేచిచూసే దుస్థితి నుంచి.. ఇప్పుడు పచ్చని పంటలు పండించే స్థాయికి చేరుకున్నామంటున్నారు.

గతంలో జోగులాంబ జిల్లా అలంపూర్​ పరిసరాలు ఆర్డీఎస్​ వచ్చాక కళకళ లాడుతూ కనిపించాయి. అర్ధాతంరంగా ఆర్డీఎస్​ పథకాన్ని నిలిపివేయడం వల్ల ఈ ప్రాంతం కళ తప్పింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం వలసబాట పట్టారు. ఇప్పుడు ఎత్తిపోతల జలాలతో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. జోగులాంబ ఎత్తిపోతల ద్వారా 3260 ఎకరాలు, క్యాతూర్​ ఎత్తిపోతల ద్వారా 3420 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడిపై ఆధారపడకుండా రెండు పంటలు పండించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: యూరియా కోసం రైతుల పడిగాపులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details