తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers face problems in kyathur : కష్టాల సుడిలో క్యాతూర్​ రైతులు.. నీరు లేక ఎండిపోతున్న పంటలు

Farmers Face Problems in Jogulamba Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా రైతుల పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. అటు సకాలంలో వర్షాలు లేక.. ఇటు కృష్ణానది బ్యాక్​వాటర్​ను ఉపయోగించుకోవడానికి నిర్మించిన క్యాతూర్ ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

Motors Problem in Kyathur Lift Irrigation Project
Farmers face problems in kyathur

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 10:56 PM IST

Motors Problem in Kyathur Lift Irrigation Project : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్​లో కృష్ణానది నుంచి తిరుగు జలాలతో ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించేందుకు 2018 సంవత్సరంలో రూ.26.52 కోట్లతో 3,460 ఎకరాల ఆయకట్టు లక్ష్యంతో క్యాతూర్-2 ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 450 హర్స్​పవర్​ సామర్థ్యంతో నాలుగు మోటార్లున్నాయి.

ఇందులో రెండు మోటార్లు.. 2022 జనవరి నుంచి పనిచేయడం లేదు.క్యాతూరు-2 ఎత్తిపోతల పథకంలో ఉన్న నాలుగింటిలో రెండు మోటార్లు పనిచేయక ఏడాదిన్నర దాటినా పట్టించుకునే నాథుడు లేడు. మిగిలిన రెండు మోటార్ల ద్వారానే నీటిని అందిస్తున్నారు. పథకం నిర్వహణ సరిగా లేకపోవడంతో పంటలకు నీరు అందించడంలో రైతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.

Telangana Rythu Runa Mafi 2023 : రూ. లక్ష, ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులు ప్రారంభం

ఎకరాకు రూ. వెయ్యి చొప్పున కమిటీ వారు రైతుల నుంచివసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం కింద పత్తి, మొక్క జొన్న, మిరప, ఉల్లి పంటలు సాగు చేశారు. పంటలు సాగు చేసిన తరువాత నుంచి చాలా రోజుల వరకు నీరు సరపరా చేయకపోవడంతో రైతులే కమిటీ వారి దగ్గరి వెళ్లి సరఫరా చేయాలని కోరారు. లేదంటే రైతుల ఆధ్వర్యంలోనే సరఫరా చేసుకుంటామని చెప్పారు. రైతుల కోరిక మేరకు కమిటీ ఎట్టకేలకు ఎత్తిపోతల నుంచి నీటి సరఫరా ప్రారంభించారు.

వారం రోజుల తర్వాత పైపులైను మూడు చోట్ల లీకేజీలు ఏర్పడడంతో మరమ్మతులు ప్రారంభించారు. వారం రోజులు పూర్తయిన లీకేజీ పనులు పూర్తికాలేదు. మరమ్మతులకు మరో వారం రోజులపాటు సమయం పట్టే అవకాశం ఉంది. పంటలు వేసి దాదాపుగా 45 రోజులు గడిచింది. అటు వర్షాలు లేక, ఇటు ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని.. తామంతా నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Rythu Runa Mafi 2023 : సాంకేతిక చిక్కులతో రైతులకు చేరని రుణమాఫీ సొమ్ము.. మూతబడిన ఖాతాల్లో జమై నిధులు వెనక్కి

వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదిలో తిరుగు జలాలు ఇప్పటికే కిందకి వెళ్లాయి. దీంతో మరికొన్ని రోజులైతే ఎత్తిపోతల పథకానికి నీరు లభ్యత కష్టతరంగా మారనుంది. అటు సకాలంలో వర్షాలు లేక, ప్రాజెక్టులలో తగిన నీరు లేక రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

"వర్షాలు సకాలంలో పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. క్యాతూర్​ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయడంలేదు. పైప్​లైన్​లు పగిలిపోయాయి. రైతులందరం కలిసి చందాలు వేసుకుని పైపులు బాగు చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మోటార్లు బాగు చేయించగలరు". - మహ్మద్​ రఫీ, రైతు

Turmeric Price Hike in Warangal : పసుపు ధరకు రెక్కలు.. ప్రస్తుతం క్వింటాకు రూ.13వేలు

ABOUT THE AUTHOR

...view details