తెలంగాణ

telangana

ETV Bharat / state

అభిమానుల ఆగ్రహానికి థియేటర్​ ధ్వంసం - gadwal latest news

వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా గద్వాల్​లో అభిమానులు హంగామా సృష్టించారు. థియేటర్​లో మూవీ చూసేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతోపాటు సినిమా ముందుగానే స్టార్ట్ చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ థియేటర్ ముఖద్వారంపై దాడి చేశారు. పాక్షికంగా ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Gadwal srinivasa theatre, Fans smashing theater doors
థియేటర్​ డోర్లు ధ్వంసం చేసిన అభిమానులు

By

Published : Apr 9, 2021, 12:21 PM IST

థియేటర్​ డోర్లు ధ్వంసం చేసిన అభిమానులు

జోగులాంబ జిల్లా గద్వాలలో పవర్ స్టార్ పవన్​కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శ్రీనివాస థియేటర్​లో ‌వేశారు. ఈ సందర్భంగా బెనిఫిట్​షోలో సినిమా బ్లర్ కావడం, సిగ్నల్ సమస్య తలెత్తింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో థియేటర్ ముఖద్వారంపై దాడి చేశారు. ద్వారం పాక్షికంగా ధ్వంసమైంది.

అదే సమయంలో టికెట్లు దొరకని పలువురు థియేటర్​లోకి దూసుకురావడం వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ యాజమాన్యం సర్ది చెప్పడంతో సమస్య సద్దు మణిగింది. అభిమానులు థియేటర్ వద్ద బాణా సంచా కాల్పులతోపాటు డప్పుల వాయిద్యంతో సందడి చేశారు. మరోవైపు అభిమానులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి నృత్యాలు చేయడంపై ప్రజలు విస్మయానికి గురయ్యారు.

ఇదీ చూడండి :''వకీల్​సాబ్'.. నా కెరీర్​లో ఉత్తమ చిత్రం'

ABOUT THE AUTHOR

...view details