తెలంగాణ

telangana

ETV Bharat / state

130 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - jogulamba gadwal district news

జోగులాంబ గద్వాల జిల్లాలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నా... నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. జిల్లాలోని మదనపల్లి గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 130 కేజీల నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.

fake cotton seeds caught in jogulamba gadwal district
130 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

By

Published : Jun 12, 2020, 6:30 PM IST

టాస్క్​ఫోర్స్​ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు గత రెండు రోజుల నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నా నకిలీ విత్తనాలు చలామణి అవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం మదనపల్లి గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 130 కేజీల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ అధికారులు నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏవో రాజశేఖర్​ తెలిపారు.

ఇవీ చూడండి: 20 టన్నుల నల్లబెల్లం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details