తెలంగాణ

telangana

'ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉద్యోగ నియామకాలు చేపట్టదు'

భాజపా, కాంగ్రెస్, తెరాసల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... సాధ్యమైనంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టరని ప్రోఫెసర్​ నాగేశ్వర్​ రావు తెలిపారు. ఉద్యోగస్థులు అయ్యాక ప్రభుత్వంపై పోరాడుతారని వారికి తెలుసని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖాముఖి చర్చ నిర్వహించారు.

By

Published : Jan 31, 2021, 10:43 PM IST

Published : Jan 31, 2021, 10:43 PM IST

Face to face discussion with Professor Nageshwar Rao in Jogulamba Gadwala District
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉద్యోగ నియామకాలు చేపట్టవు

భాజపా, కాంగ్రెస్, తెరాసల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... సాధ్యమైనంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టరని ప్రోఫెసర్​ నాగేశ్వర్​ రావు తెలిపారు. ఉద్యోగస్థులు అయ్యాక ప్రభుత్వంపై పోరాడుతారని వారికి తెలుసని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో... ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు ఆయనతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. దానికి తోడు ఆర్థిక విధానంలో ప్రభుత్వ పాత్రను తగ్గించి ప్రైవేటు పాత్రను పెంచాలని ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. ఈ విధానంలో ఆ పార్టీల మధ్య ఎటువంటి తేడాలు లేవన్నారు.

వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడతారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వకపోతే కేసీఆర్ అంతు చూస్తామని అంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్ట వద్దని కిందటి సంవత్సరం సెప్టెంబర్​లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్​ జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్తులో యువత చైతన్య దిశగా ముందుకు వెళ్లినప్పుడే అభివృద్ధికి బాటలు వేస్తారని అన్నారు.

ఇదీ చదవండి: పోచమ్మ ఆలయ ముఖద్వార పనులను ప్రారంభించిన తలసాని

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details