తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం - పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం

జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలక ఎన్నికలకు నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంటుండడం వల్ల అభ్యర్థులు వార్డుల వారీగా ప్రచారం ముమ్మరం చేశారు. తెరాస పార్టీ అభ్యర్థులే గెలుస్తారని కౌన్సిలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

election-campaign-in-jogulambha-gadwal
పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం

By

Published : Jan 13, 2020, 7:57 PM IST

పురపాలక ఎన్నికల్లో ఈ సారి అన్ని వార్డులలో తెరాస పార్టీ అభ్యర్థులే గెలుస్తారని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగియడం వల్ల అభ్యర్థులు వార్డులవారీగా ప్రచారం మొదలుపెట్టారు.

రేపు నామినేషన్ల చివరి రోజు కావడం వల్ల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 14వ వార్డుకు చెందిన అభ్యర్థులు వార్డులో ఇంటింటికీ తిరుగుతూ తెరాసకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

పుర ఎన్నికలకు వార్డులవారీగా ప్రచారం ముమ్మరం

ఇదీ చదవండి:విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

ABOUT THE AUTHOR

...view details