తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు - farmers

ఈదురు గాలులకు జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, మునగ తోటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు

By

Published : Apr 23, 2019, 3:42 PM IST

ఈదురు గాలులకు భారీగా నష్టపోయిన మామిడి రైతులు

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, మల్దకల్, గట్టు ప్రాంతాల్లో ఈదురు గాలులకు సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, మునగ తోటలు దెబ్బతిన్నాయి. గద్వాల మండలంలోని తుకొన్ని పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు లక్షా 40 వేలకు మామిడి తోటను గుత్తకు తీసుకోగా గాలులకు పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని నరసింహులు కోరుచున్నాడు. బలమైన ఈదురు గాలులకు చాలా ప్రాంతాల్లో మునగ తోట మరియు మామిడి తోటలు దెబ్బతిన్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details