తెలంగాణ

telangana

ETV Bharat / state

Alampur Jogulamba Temple: శైలపుత్రి అలంకరణలో జోగులాంబ అమ్మవారు - Dussehra navaratri celebrations

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జోగులాంబ ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Alampur Jogulamba Temple
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 7, 2021, 1:09 PM IST

పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయం(jogulamba temple)లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలతో మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి వారి ఆలయం చేరుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలకు స్వామి వారి ఆనతి స్వీకరించారు. అనంతరం ఆలయంలో ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, గణపతి పూజ చేశారు.

ఆర్జిత సేవలు రద్దు

ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, క్యూలైన్లు, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

జోగలాంబ అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తారని... 9 రోజుల పాటు సహస్రనామార్చన, నవావరణ అర్చనలు, చండీహోమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు విశేష పూజలు, చండీ హోమం నిర్వహిస్తామన్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన దర్బార్ కొలువు సేవలో కుమారి సుహాసిని పూజలు జరుగుతాయి. దసరా పండుగ రోజు స్వామి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.

కార్యక్రమాలు..

ఈ నెల 12న జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణోత్సవం, 13వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా రథోత్సవం, ఈనెల 15న విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం... అదే రోజు సాయంత్రం 4 గం.కు శమీ పూజ, నదీహారతి జరుపుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇదీ చూడండి:DUSSEHRA CELEBRATIONS 2021: బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో.. భద్రకాళి అమ్మవారు

ABOUT THE AUTHOR

...view details