తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది: డీకే అరుణ - DK Aruna visiting Jogulamba Gadwal

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు.

dk-aruna-fires-on-trs-government-in-jogulamba-district
dk-aruna-fires-on-trs-government-in-jogulamba-district

By

Published : Mar 9, 2021, 5:26 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ ముందుగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం హరిత టూరిజం హోటల్​లో ఏర్పాటు చేసిన అలంపూర్​ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో భ్యాంక్​ ఆఫ్ బరోడా రిటైర్డ్ మేనేజర్​ రాజగోపాల్​, తదితరులు భాజపాలో చేరారు.

భాజాపాలో చేరిక

కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని... డీకే అరుణ ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాలు పక్కనపెట్టి... కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. వాళ్లను గద్దె దించాలంటే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాంచంద్రరావును అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో నియంతపాలనకు విముక్తి కలగాలంటే భాజపాతోనే సాధ్యమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details