మాజీ మంత్రి ఈటలపై చర్యలు తీసుకున్నట్లే.. అవినీతి ఆరోపణలున్న ప్రజాప్రతినిధులందరిపై వెంటనే విచారణ జరిపించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు 7 ఏళ్లుగా అనేక భూములు కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నివాసంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
వారందరిపై విచారణ జరిపించాలి: డీకే అరుణ - మాజీ మంత్రి ఈటల
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో.. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు 7 ఏళ్లుగా.. అనేక భూములు కబ్జా చేశారని ఆమె ఆరోపించారు.
dk aruna
రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరంముందన్నారు అరుణ. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండగా చూడాలని కోరారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:14 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీరుతెన్నులు