జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామ ప్రజలకు నూతన పునరావాస కేంద్రాల్లో పక్కా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ర్యాలంపాడులోని భూ నిర్వాసితులైన 630 మందికి ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు.
ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ర్యాలంపాడు ప్రజలు తమ భూములను రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇచ్చి.. వారు చేసిన మేలును ఎన్నడూ మరచి పోలేమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కొనియాడారు. రిజర్వాయర్ కోసం భూములను ఇచ్చినా.. గత పాలకులు వారికి పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.