తెలంగాణ

telangana

ETV Bharat / state

అభిమానం చాటుకున్న ఫ్యాన్​... మందుబాబుల దిల్​కుశ్​ - శంకర్​ పెళ్లి రోజున మందు పంచి అభిమాని

హీరోలు, నాయకుల పుట్టిన రోజులకు అభిమానులు... అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రుల్లో పాలు, పండ్లు పంచడం చాలా సాధారణమైన విషయం. తన అభిమాన వ్యక్తి దృష్టిని ఆకర్షించాలనుకున్నాడో... వార్తల్లో నిలవాలనుకున్నాడో... ఈ వీరాభిమాని మాత్రం తనకు ఇష్టమైన వ్యక్తి పెళ్లిరోజున... అన్నింటికీ భిన్నంగా... మరీ వినూత్నంగా... మద్యం పంచాడు. ఫ్రీగా కాందండోయ్​... రూపాయికి ఓ క్వార్టర్​ చొప్పున పంచాడు. అసలు ఆ వీరాభిమాని ఎవరో మీరే చూడండి...

director shankar fan distributed quarter liquor bottles for one rupee
director shankar fan distributed quarter liquor bottles for one rupee

By

Published : Nov 15, 2020, 8:08 PM IST

అభిమానం చాటుకున్న ఫ్యాన్​... మందుబాబులు దిల్​కుశ్​

నవంబర్​ 16న తెలంగాణ సినిమా డైరెక్టర్ ఎన్.శంకర్ పెళ్లి రోజు. ఈ వేడుకను పురస్కరించుకుని శంకర్​ అభిమాని అయిన తెరాస పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు... వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఒక్క రూపాయికి ఒక్క క్వార్టర్ చొప్పున మద్యం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఒక గంట పాటు మాత్రమే కొనసాగించారు.

విషయం తెలుసుకున్న మందు బాబులు పెద్దసంఖ్యలో వైన్స్​ వద్దకు చేరుకున్నారు. పంపిణీకి గంట సమయం మాత్రమే కేటాయించటం వల్ల కొంత మందికి మాత్రమే ఆ అదృష్టం వరించింది. పరిమిత కాలంలో టోకెన్లు దక్కించుకున్న 45 మంది ఒక్క రూపాయి చెల్లించి మద్యాన్ని అందుకోగలిగారు. భౌతిక దూరం పాటింపజేస్తూ... పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వార్టర్ తీసుకున్న లబ్ధిదారులు అమితానందం వ్యక్తం చేశారు. టోకెన్లు అందుకోలేకపోయిన చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సైతం విష్ణు నిర్వహించారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శంకర్​తో పరిచయం ఉందని విష్ణు తెలిపారు. శంకర్​పై అభిమానంతోనే పెళ్లిరోజు సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించానని వివరించారు.

ఇదీ చూడండి: 'గ్రేటర్‌లోనూ దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details