తెలంగాణ

telangana

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాల్లో నదీమ తల్లికి దశవిధ హారతి - తుంగభద్ర నదికి దశవిధ హారతి

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తుంగభద్ర నదీ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో భాగంగా నదీమ తల్లికి వేద పండితులు దశవిధ హారతులిచ్చారు.

తుంగభద్ర నదీమ తల్లికి దశవిధ హారతి
తుంగభద్ర నదీమ తల్లికి దశవిధ హారతి

By

Published : Nov 20, 2020, 8:49 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో తుంగభద్ర నదీ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో భాగంగా నదీమ తల్లికి వేద పండితులు దశవిధ హారతులిచ్చారు. పుష్కర కాలంలో ముక్కోటి దేవతలు నదీ గర్భంలో ఆవాసమై ఉంటారని... అందుకే ముక్కోటి దేవతల నుంచి సకల శుభాలు కలగాలని కోరుతూ వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాద్యాల మధ్య దశవిధ హారతులు సమర్పించారు.

దశవిధ హారతిలో ఏక హారతి, నేత్ర హారతి, బిల్వ హారతి, వేద హారతి, సంధ్యూజతాది పంచహారతి, చక్ర హారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, రతి హారతులు ఇచ్చారు. ఇవాళ వేద పండితులు ఐదు హారతులు సమర్పించారు.

ఇదీ చూడండి: వేద మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details