తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్మశానవాటిక స్థలం కోసం యాక్తాపూర్ గ్రామస్థుల ధర్నా - శ్మశానవాటిక స్థలం కోసం యాక్తాపూర్ గ్రామస్థుల ధర్నా

శ్మశానవాటిక స్థలం కోసం జోగులాంబ గద్వాల జిల్లా యాక్తాపూర్ గ్రామస్థులు బీచుపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నాకి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి సముదాయించడం వల్ల ఆందోళనను విరమించారు.

yakthapur villagers dharna
శ్మశానవాటిక స్థలం కోసం యాక్తాపూర్ గ్రామస్థుల ధర్నా

By

Published : Mar 2, 2020, 6:59 PM IST

జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం యాక్తాపూర్​ గ్రామస్థులు బీచుపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాక్తాపూర్​లోని శ్మశానవాటిక స్థలాన్ని అధికారులు కొందరు అక్రమార్కుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేశారని వాపోయారు. అందుకు నిరసనగానే... తాము ఆందోళన నిర్వహిస్తున్నట్లు వివరించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడం వల్ల 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.

శ్మశానవాటిక స్థలం కోసం యాక్తాపూర్ గ్రామస్థుల ధర్నా

ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details