జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు విజయదశమి సందర్భంగా సాయంత్రం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం ఎనిమిది గంటలకు అర్చకులు పూర్ణాహుతి, అవబృద స్నాపనం, సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ ఆవరణలో శమీ పూజ నిర్వహించారు.
అలంపూర్లో ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు
శక్తి పీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమిని పురస్కరించుకుని చివరి రోజు అమ్మవార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
అలంపూర్లో ముగిసిన దేవీ నవరాత్రి ఉత్సవాలు
తుంగభద్ర నది తీరంలో అమ్మవార్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో స్వామి, అమ్మవార్లు నదిలో విహరించారు. ఈ వేడుకను తిలకించడానికి పెద్దఎత్తున భక్తులు హాజరయ్యారు. జోగులాంబ అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మార్మోగాయి. కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే వీఎం అబ్రహం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.