తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం - జోగులాంబలో పట్టాల పంపిణీ తాజా వార్తలు

అలంపూర్​లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అబ్రహం శ్రీకారం చుట్టారు. మండలంలోని కూరగాయల మార్కెట్ సముదాయం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలానికి భూమి పూజ చేశారు. తెరాసలోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

Development work was initiated by MLA Abraham in Alampur
అలంపూర్​లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

By

Published : Oct 2, 2020, 3:43 PM IST

జోగులాంబ జిల్లాలోని అలంపూర్​ పురపాలక పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అబ్రహం భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ముందుగా పురపాలకలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కూరగాయల మార్కెట్ సముదాయం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలానికి భూమి పూజ చేశారు. అలాగే పట్టణంలోని రెండో వార్డు సంతోశ్​నగర్​లో వడ్డే గుంత పూడిక పనులకు భూమి పూజ నిర్వహించారు.

తెరాస పాలనలోనే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పార్టీలకతీతంగా కొత్తగా ఏర్పడిన పురపాలికను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా పదిమందికి పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ABOUT THE AUTHOR

...view details