జూరాలకు తగ్గిన వరద.. గేట్లు మూసివేసిన అధికారులు - జూరాలకు తగ్గిన వరద
ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద క్రమంగా తగ్గడం వల్ల జూరాల జలాశయం వద్ద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద తగ్గడం వల్ల జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయానికి 50 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318. 220 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.390 మీటర్లు, జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 9.050 టీఎంసీల నీరు ఉంది. నెట్టెంపాడు 1,500 క్యూసెక్కులు, భీమా 1,650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కు 630 క్యూసెక్కులు, జూరాల కుడికాలువకు 391 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 900 ప్యార్లల్ కెనాల్ 800 క్యూసెక్కులు, భీమారం-02కి 750 క్యూసెక్కుల నీటిని సాగునీటి కాలువలకు విడుదల చేస్తున్నారు.