తెలంగాణ

telangana

ETV Bharat / state

నివర్ ప్రభావం: అంతంతమాత్రంగానే పుష్కరాలు

నివర్ తుపాన్ కారణంగా తుంగభద్ర పుష్కరాల్లో భక్తుల సందడి తగ్గింది. ఏడు రోజుల పాటు వైభవంగా జరిగిన పుష్కరాలు... చలి గాలుల నేపథ్యంలో అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. రోజూలాగే అర్చకులు నదీమ తల్లికి నిత్యహారతులిచ్చారు.

tungabhadra pushkaralu in telangana
నివర్ ప్రభావం: అంతంతమాత్రంగానే పుష్కరాలు

By

Published : Nov 27, 2020, 7:30 PM IST

ఎనమిదో రోజు పుష్కరాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడు రోజులుగా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణు సోంపురాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఏడు రోజులపాటు కళకళలాడిన పుష్కర ఘాట్లు... తుపాను ప్రభావంతో వెలవెలబోతున్నాయి.

నివర్ ప్రభావం: అంతంతమాత్రంగానే పుష్కరాలు

నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల అత్యల్ప సంఖ్యలో భక్తులు వచ్చారు. వర్షంలోనే భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి... స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నదీమ తల్లికి అర్చకులు నిత్య హారతులిచ్చారు. పుల్లూరు, అలంపూర్ పుష్కర ఘాట్లలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షించారు.

వివిధ పుష్కరఘాట్లలో భక్తుల సంఖ్య...

అలంపూర్ - 7790మంది

పుల్లూరు- 1556మంది

రాజోలి-1639

వేణిసొంపురం- 668మంది

ఇదీ చదవండి:వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు

ABOUT THE AUTHOR

...view details