తెలంగాణ

telangana

ETV Bharat / state

మిరపతోటలో గంజాయి సాగు - జోగులాంబ గద్వాల జిల్లాలో మిరపతోటలో అంతర్​ పంటగా గంజాయి సాగు

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో గంజాయి పండిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మిరపతోటలో అంతర్​ పంటగా గంజాయి సాగుచేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

మిరపతోటలో గంజాయి సాగు

By

Published : Nov 7, 2019, 8:38 PM IST

గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఈడిగోని పల్లిలో గంజాయి పండిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో గంజాయి పండిస్తున్నారన్న సమాచారంపై సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై, ఇతర పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన దయ్యం నాగన్న, కృష్ణ, హనుమంతు, నాగేష్, లింగన్నలు మిరప పంటలో అంతర్​ పంటగా గంజాయి పండిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి చెట్లను పీకేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

మిరపతోటలో గంజాయి సాగు

ABOUT THE AUTHOR

...view details