జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం ఐదు కౌంటింగ్ హాళ్లు, 37 వార్డులకు 37 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 45 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 89 మంది అసిస్టెంట్లు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు లెక్కింపులో పాల్గొననున్నారు.
గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం - గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు
జోగులాంబ గద్వాల జిల్లాలోని నాలుగు పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గద్వాల మండలంలోని గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
![గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం counting arrangements for municipal election in jogulamba gadwal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5828034-thumbnail-3x2-a.jpg)
గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం
గద్వాల జిల్లా పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం
వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ సమక్షంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. గద్వాల కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నిరంజన్ పరిశీలించారు.
లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.