జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల హోమ్ క్వారంటైన్‌లోని 34 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. అధికారులు వారందరినీ స్వస్థలాలకు పంపించారు. సొంతూరైన వడ్డేపల్లి చేరుకున్న వారందరికీ.. స్థానికులు చప్పట్లతో స్వాగతం పలికారు. గతంలో వడ్డేపల్లి పురపాలిక కేంద్రంలో కరోనా పాజిటివ్‌తో ఒక వ్యక్తి మరణించాడు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అనుమానితులందరినీ ఇటిక్యాల మండలంలోని క్వారంటైన్‌కు తరలించింది. అందులో 34 మందికి కరోనా నెగెటివ్ రాగా.. తిరిగి ఇళ్లకు పంపించారు.
క్వారంటైన్ నుంచి ఇళ్లకు... చప్పట్లతో స్థానికుల స్వాగతం - Jogulambagadwala Corona Negative
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలోని క్వారంటైన్ నుంచి 34 మంది ఇళ్లకు చేరారు. వారికి స్థానికులు చప్పట్లతో స్వాగతం పలికారు.
క్వారంటైన్ నుంచి ఇళ్లకు చేరిన కరోనా అనుమానితులు