దేశంలో నేడు అందరికీ సంక్షేమ ఫలితాలు అందుతున్నాయంటే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన కృషే కారణమని జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీకి విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణుల నివాళి - తెలంగాణ వార్తలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మాస్కులను పంపిణీ చేశారు.
రాజీవ్ గాంధీకి నివాళులు, రాజీవ్ గాంధీ వర్దంతి 2021
దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిందనన్నారు. అభివృద్ధికి నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ అని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో పాదచారులకు మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:'నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించండి'