జోగులాంబ గద్వాల జిల్లా ర్యాలంపాడు గ్రామంలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. అనంతరం సభలో ప్రసంగిస్తుండగా మధ్యలో మైక్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్ లాక్కున్నారు. మందకృష్ణ మాదిగ... తెరాస ప్రభుత్వం వల్ల మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం - Jogulamba Gadwal District latest news
జోగులాంబ గద్వాల జిల్లాలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో గందరగోళం చోటుచేసుకుంది. మందకృష్ణ మాదిగకు, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ బండారి భాస్కర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
సభలో గందరగోళం.. మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం
దీనితో మందకృష్ణ, బండారి భాస్కర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. బండారి భాస్కర్‌ను సభాస్థలం నుంచి బయటకు తీసుకెళ్లడంతో సభ తిరిగి ప్రారంభమైంది.
ఇవీచూడండి:' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్'