గద్వాల కూరగాయాల మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నదాతల కష్టాలు పట్టని కమీషన్ ఏజెంట్లు ఉల్లిగడ్డకు రూ.10, ఇతర కూరగాయలకైతే రూ.8 వసూలు చేస్తున్నారు. టమాట బాక్స్ ధర రూ.100 అమ్ముడవుతోంది. అదే మూడు నాలుగు రోజుల కిందట బాక్స్‌కు రూ.50లకు మించి ధర రాలేదు. బెండకాయ రూ.30, ఉల్లి క్వింటా రూ.400 నుంచి రూ.800 వరకు ధర పలుకుతుంది. పంటను పొలం నుంచి మార్కెట్‌కు తీసుకొస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాది కిందట నల్లకుంటలోని మున్సిపల్ స్థలంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీకి రూపేణా డబ్బులు చెల్లించేవారు. కానీ 2020 మార్చి నెలలో కరోనా సమయంలో వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో కూరగాయల మార్కెట్ నిర్వహణ కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మున్సిపల్ అధికారులకుగానీ ఇటు వ్యవసాయ మార్కెట్ అధికారులకుగానీ చిల్లిగవ్వ చెల్లించడం లేదు.
నిబంధనలు ఇలా...
మార్కెట్ నిబంధనల ప్రకారం రూ.100కు రూ.4 వసూలు చేయాల్సి ఉంది. ఇందులో మార్కెట్ సెస్‌కు రూ.100కు రూ.1, ఇందులోనే హమాలీలకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏడాదిగా మార్కెట్‌కు ఒక్క రూపాయి చెల్లించిన దాఖలాలు లేవు. మార్కెట్ యార్డు అధికారుల నియంత్రణ లేకపోవడంతో కూరగాయల కమీషన్ ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. ఇదేమని అధికారులను అడిగితే మార్కెట్ నుంచి లైసెన్సులు తీసుకుంటేనే మా పరిధిలోకి వస్తుందనే సమాధానం వస్తుంది. మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్నందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. కానీ ఎవరికి ఇస్తున్న విషయాన్ని బహిర్గతం చేయడం లేదు.
దీనంగా రైతుల పరిస్థితి
మూడు ఎకరాల్లో టమాట సాగు చేస్తే... రోజుకు 60 నుంచి 70 బాక్స్‌ల వరకు దిగుబడి వస్తుందని గద్వాల రైతు శ్రీనివాసులు తెలిపారు. కూలీలకు ఒక్కొక్కరికి రూ.200 చెల్లిస్తు న్నామని... పొలం నుంచి మార్కెట్‌కు తీసుకురావడానికి ఆటోకు రూ.1,500 చెల్లిస్తున్నామని వెల్లడించారు. కానీ మార్కెట్‌లో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోయారు. ఒక్కో బాక్స్ రూ.100లకు మించడం లేదు. మార్కెట్ కమీషన్‌దారులు మాత్రం రూ.100కు రూ.8 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ ఫీజు వసూలు చేయడం లేదు