తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నోనిపల్లి జలాశయం పనులపై కలెక్టర్ సమీక్ష - కలెక్టర్‌ శృతి ఓజా

గట్టు మండలం చిన్నోనిపల్లి జలాశయం నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ శృతి ఓజా సందర్శించారు. ప్లాట్ల లే అవుట్, ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ముంపు ప్రాంతంలో మొత్తం 360 కుటుంబాలు ఉండగా.. పునరావాస ప్రాంతంలో 412 ప్లాట్లు ఏర్పాటు చేశామన్నారు.

Collector's review on Cheroniipally reservoir works
చిన్నోనిపల్లి జలాశయం పనులపై కలెక్టర్ సమీక్ష

By

Published : Jun 6, 2020, 10:13 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి నిర్వాసితులకు కేటాయించిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ శృతి ఓజా సందర్శించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్షించారు. పునరావాసంకోసం కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతంకావడం వల్ల ఇళ్లు నిర్మించుకోడానికి చాలా వ్యయం అవుతుందని.. ఇప్పటి వరకు నిర్వాసితులు ఎవరూ ఇళ్లు నిర్మించుకోలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఏ ప్లాటుకు ఎన్ని ట్రాక్టర్ల మట్టి అవసరమతుందో ఇంజినీర్ల నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని పాలనాధికారిణి తెలిపారు. నిధుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముంపు ప్రాంతంలో మొత్తం 360 కుటుంబాలు ఉండగా.. పునరావాస ప్రాంతంలో 412 ప్లాట్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్‌ శృతి ఓజా వెల్లడించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details