తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రొఫెసర్ అడుగుజాడల్లో నడుద్దాం: కలెక్టర్ శృతి - జోగులాంబ కలెక్టరేట్ లో జయశంకర్ జయంతి

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను విస్మరించకుండా ఆయన చూపిన అడుగుజాడల్లో నడుస్తూ.. తాను తెలంగాణపై కన్న కలలను సాకారం చేయటమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులని కలెక్టర్ శృతి ఓఝా అన్నారు.

ప్రొఫెసర్ అడుగుజాడల్లో నడుద్దాం: కలెక్టర్ శృతి
ప్రొఫెసర్ అడుగుజాడల్లో నడుద్దాం: కలెక్టర్ శృతి

By

Published : Aug 6, 2020, 7:55 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణకై ప్రొఫెసర్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. తెలంగాణ వనరులు, నైసర్గిక స్వరూపం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. తన రచనల ద్వారా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ రాజు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details