తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Gadwal Tour Today : నేడు గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన - జోగులాంబ గద్వాల జిల్లా

CM KCR Visits Gadwal District Today : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. గద్వాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు, పనుల పురోగతిని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సభలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

CM KCR Gadwal Tour Today
CM KCR Gadwal Tour Today

By

Published : Jun 12, 2023, 6:52 AM IST

CM KCR Inaugurates Gadwal district New Collectorate today :ముఖ్యమంత్రి కేసీఆర్నేడు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో గద్వాల కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్న కేసీఆర్.. ముందుగా రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి నేరుగా పీజేపీ క్యాంపు స్థలంలో కొత్తగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం, అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం అయిజ రోడ్డు తెలంగాణ చౌరస్తా సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

CM KCR Visits Gadwal District Today :ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏళ్లుగా వెనకబాటుకు గురైన నడిగడ్డను జిల్లాగా మార్చి, ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లే గద్వాల నేడు ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూరైనట్లు వెల్లడించారు.

CM KCR Gadwal Tour Today :ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నారు. సుమారు లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వైద్య కళాశాలలు ఇప్పటికే ప్రారంభం కాగా.. గద్వాలలో వైద్యకళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

సీఎం పర్యటన కోసం 2 వేల మందితో బందోబస్తు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన గట్టు ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, గుర్రంగడ్డ వంతెన హామీల అమలు, పనుల పురోగతిని సీఎం ప్రజలకు వివరించే అవకాశం ఉంది. గత పాలకుల పరిపాలన, తొమ్మిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రగతిని ప్రజలకు ఏకరవు పెట్టనున్నారు. సీఎం పర్యటన కోసం పోలీసులు 2 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గద్వాలలో చుట్టుపక్కల పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బహిరంగ సభ కోసం తరలివచ్చే వాహనాల కోసం ఔటర్ రింగ్ రోడ్డు, పక్కనే ఉన్న దర్గా, పిల్లిగుండ్ల కాలనీ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details