ఇంటిగోడ కూలి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన గద్వాలలో జరిగింది. పట్టణంలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ వాహిద్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు మాన్య స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.
హోం వర్క్ చేసుకుంటుండగా.. గోడ కూలి చిన్నారి మృతి - గద్వాలలో హోం వర్క్ చేసుకుంటుండగా గోడ కూలి చిన్నారి మృతి
ఆ చిన్నారి పాఠశాల నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. ఇంట్లోని ఓ గోడ పక్కన కూర్చోని హోంవర్క్ చేసుకుంటోంది. ఇంతలోనే అకస్మాత్తుగా గోడ కూలిపోయింది. చిన్నారికి తీవ్ర గాయాలై.. అక్కడిక్కడే మృతి చెందింది.
హోం వర్క్ చేసుకుంటుండగా.. గోడ కూలి చిన్నారి మృతి
ఇంట్లో కూర్చుని చిన్నారి హోం వర్క్ చేసుకుంటుండగా అకస్మాత్తుగా గోడ కూలింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అబ్దుల్ వాహిద్ దంపతులు గత కొన్నాళ్లుగా పాతబడిన ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సరైన ఇల్లు లేకనే తమ కూతుర్ని కోల్పోయామని తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా
Last Updated : Feb 16, 2020, 4:13 PM IST