'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా' - డీకే అరుణ
పాలమూరు జిల్లాలో ఇద్దరు మహిళలను అభ్యర్థులుగా ప్రకటించామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. వారిని గెలిపించాల్సిన అవసరం ఉందని.. జిల్లా అభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా'
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భాజపా విజయ్ సంకల్ప సభకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థులుగా మహిళలకు అవకాశం ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీకె అరుణ, బంగారు శ్రుతి, పెద్ద ఎత్తున కాషాయ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా'
Last Updated : Apr 8, 2019, 10:26 AM IST