జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నది పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తిక మాసం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెల్లవారుజామునే పుణ్య స్నానమాచరించి దీపాలు వెలిగించారు. ఘాట్ సమీపంలో కార్తిక దీపాలు వెలిగించి నదీమ తల్లికి మొక్కులు తీర్చుకున్నారు. దీపాల కాంతుల్లో తుంగభద్ర నది వెలుగులీనింది. తుంగభద్రకు హారతి ఇచ్చిన అర్చకులు... తుఫాను ప్రభావంతో తొందరగా ముగించారు.
వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు - వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర నది పుష్కరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. కార్తిక మాసం పురస్కరించుకొని భక్తులు తెల్లవారు జామునే దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపాల కాంతుల్లో తుంగభద్ర వెలుగులీనింది.
వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు
అలంపూర్ పుష్కర ఘాట్లో ఏడో రోజు భక్తుల రద్దీ తగ్గగా... రాజోలిలో భక్తుల పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఆరో రోజు 4,065 మంది వస్తే... గురువారం నాడు 8,749 మంది భక్తులు వచ్చారు. పుల్లూరులో 3,200మంది, వేణిసోంపురంలో 1,510 మంది తరలి వచ్చారు. పుల్లూర్ ఘాట్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్, రాజోలి ఘాట్లో ఏపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, అలంపూర్లో మాజీ ఎంపీ మందా జగన్నాథం పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి:నివర్ ఎఫెక్ట్: 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు...