జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి శివారు సమీపంలో ఆర్డీఎస్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ కూలీలు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలంపూర్ ఇన్ఛార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఉండవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు.
కాలువలో కాలిన మృతదేహం - జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి తాజా వార్తలు
అలంపూర్ ఉండవల్లి శివారు ఆర్డీఎస్ కాలువలో సగం కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

కాలువలో కాలిన మృతదేహం
కాలవ గట్టుపై కర్నూల్ రిజిస్ట్రేషన్ నంబరు ఏపీ21 బీజీ 1235 ద్విచక్ర వాహనం వారికి లభించింది. ఘటనా స్థలంలో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. మృతదేహం ఎవరిది, ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ద్విచక్ర వాహనం ఆధారంగా మృతి చెందిన వ్యక్తి కర్నూల్ వాసి కావొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'