RS Praveen Kumar: తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం గడీల పాలనను అంతమొందించేందుకు అందరూ కదిలి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
RS Praveen Kumar: మార్చి 6 నుంచి రాజ్యాధికార యాత్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - మహబూబ్నగర్ తాజా వార్తలు
RS Praveen Kumar: సీఎం కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక పాలనను గడపగడప తిరిగి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎక్కడికి వెళ్లినా బీఎస్పీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని... రాబోయే కాలంలో రాజ్యాధికారం తమదే అని తెలిపారు. అదేవిధంగా మార్చి 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికార యాత్ర చేపటనున్నట్లు ప్రకటించారు.
మాట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మార్చి 6 నుంచి జనగామ జిల్లా ఖిలాషాపూర్ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో పాదయాత్రను ప్రారంభిస్తామని తెలిపారు. సుమారు 300 రోజుల పాటు 5వేల గ్రామాలలో యాత్ర చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Srinivas Goud Murder Plan : 'ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు'