జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 43వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బస్ రోకోకు ఆర్టీసీ కార్మికులు బయలుదేరారు. ఉదయం నుంచి వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను అరెస్ట్ చేయగా.. కొందరు ఆర్టీసీ కార్మికులు గద్వాల డిపో ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు.
బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - గద్వాలలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ లేటెస్ట్ వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపో ముట్టడికి ఆర్టీసీ కార్మికులు యత్నించగా బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్