తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ఆబ్కారీ శాఖ పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధినం చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంద్రప్రదేశ్‌కు తరలిస్తున్న మద్యాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ సీఐ, లక్ష్మీ దుర్గయ్య, రాజశేఖర్ గౌడ్లు తనిఖీలు చేసి మద్యం పట్టుకున్నారు. అలంపూర్ చౌరస్తా నుంచి రూ.60 వేల విలువ చేసే మద్యాన్ని కర్నూలుకు తరలిస్తుండగా సరిహద్దు పోలీసులు మద్యంతో పాటు.. వాహనం, మద్యం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు - అలంపూర్ వార్తలు
రాష్ట్ర సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనంతో పాటు మద్యం తరలిస్తున్న వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు