Bonkur Palakova :జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు.. స్వచ్ఛమైన పాలకోవాకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఈ గ్రామంలో 3 కుటుంబాలు దశాబ్దాలుగా పాలకోవా తయారీయే జీవనాధారంగా పనిచేస్తున్నాయి. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వృత్తిని అలాగే కొనసాగిస్తున్నాయి. కాసిం, షాలీ బాషా, రసూల్ బాషా ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాలకోవా తయారీని జీవనోపాధిగా మార్చుకుని 50 ఏళ్లుగా అదే తమ వృత్తిగా కొనసాగుతున్నారు.
The Famous Bonkur Palakova :ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలాచోట్ల పాలకోవాతయారీ కేంద్రాలున్నాయి. అక్కడితో పోల్చితే బొంకూరు పాలకోవా భిన్నంగా, రుచికరంగా, నాణ్యంగా ఉంటుంది. కారణం ఆధునాతన పద్ధతులు కాకుండా పాత విధానంలో కోవా తయారీని వీళ్లు కొనసాగిస్తున్నారు. కోవా తయారికీ స్వచ్ఛమైన పాలు వినియోగిస్తారు. నిత్యం ఉదయాన్నే రైతుల వద్దకు వెళ్లి పాలు సేకరిస్తారు. పాలు వారి ముందే పితకాలి. నీళ్లు కలపకూడదు. పాలల్లో నీళ్లు కలిపితే కోవా నాణ్యత దెబ్బతింటుంది. రుచి మారిపోతుంది. నిల్వ ఉండదు. అందుకే స్వచ్ఛమైన పాలనే సేకరిస్తారు.
Bonkur Famous Pikka kova :అలా సేకరించిన పాలను కట్టెల పొయ్యిమీద నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. బాగా మరిగాక అందులో చక్కెర కలిపి కోవా చేస్తారు. అందులో మూడు రకాల కోవాలున్నాయి. సాధారణంగా చక్కెరతో చేస్తారు. చక్కెర వద్దనుకునే వారికి బెల్లం కలిపి చేస్తారు. ఏం కలపకుండా పాలను మరిగించి తయారు చేసే కోవా.. పిక్కా కోవా. దీన్ని వంటల్లో స్వీట్ల తయారీ (Sweets Preparation)కోసం వినియోగిస్తారు. ఎక్కువగా శుభకార్యాలు(Subhakaryalu) జరుగుతున్నప్పుడు పిక్కా కోవా తీసుకువెళ్తారు. ఈ మూడు రకాల కోవాలను ఆర్డర్ల మీద ఈ మూడు కుటుంబాలు తయారు చేస్తాయి. ఎన్నిరోజులు నిల్వ ఉండాలన్న దాన్ని బట్టి కూడా తయారీ ఉంటుంది.