స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన ఉత్సవాలను అలంపూర్ పట్టణంలో వివేకానంద యూత్ వారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి యూత్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి... తను కూడా రక్తదానం చేసి యువతను ప్రోత్సహించారు. వివేకానంద యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అనంతరం యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం - వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో నేషనల్ యూత్ డే సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన కార్యక్రమం