జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన బతుకమ్మ, చిన్న నరసింహులు దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వారి మూడవ కూతురు నాగరాణి పుట్టుకతో అంధురాలు. ఉన్న రెండెకరాల పొలంలో సేద్య చేసి... పిల్లలను పోషించుకుంటూ వారంతా జీవనం సాగిస్తున్నారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు...
చదువు పట్ల ఆసక్తితో ఎంఏ పూర్తి చేసింది నాగరాణి. దానితో పాటు కూచిపూడి నృత్యంలోనూ జాతీయ స్థాయిలో రాణించింది. గతేడాది చికాగో నగరంలో నిర్వహించిన తానా ఉత్సవాల్లో పాల్గొని తన ప్రతిభ చాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాలశ్రీ రాష్ట్రపతి అవార్డు, వికలాంగుల సాధికారత అవార్డులను పొందింది. వాటితో పాటు రాష్ట్ర స్థాయిలో బాలరత్న అవార్డు, ప్రశంసలు అందుకుంది.