జోగులాంబ గద్వాల జిల్లా ఐజ - పులికల్ మధ్య 9 కిలోమీటర్ల మేర అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ భాజపా నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈ రోడ్డుపై నాలుగు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని... రహదారి సరిగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ... తుపత్రాల గ్రామం నుంచి ఐజ వరకు జిల్లా భాజపా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర ఐజ– రాయచూరు జాతీయ రహదారిపై బైఠాయించారు.
భాజపా ధర్నా... పోలీసులు, నాయకుల తోపులాట - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ - పులికల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ భాజపా నాయకులు పాదయాత్ర చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది.
భాజపా ధర్నా: పోలీసులు, నాయకుల తోపులాట
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భాజపా నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకూ వినకపోవడంతో నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో భాజపా నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.