జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దర్శించుకున్నారు. వసంతపంచమి సందర్భంగా కలశంతో అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే వసంతపంచమి రోజు అమ్మవారు నిజరూప దర్శనమిస్తారు.
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వసంతపంచమి చివరిరోజు కావడంతో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శించుకున్నారు. అమ్మవారికి కలశంతో అభిషేకం నిర్వహించారు.
జోగలాంబ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ
భక్తులు పెద్దసంఖ్యలో కలశాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల వేషాధారణలో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐదు రోజులుగా జోగులాంబ అమ్మవారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి :ఈనెల 23న బీసీ సంక్షేమ సంఘం ఆందోళనలు
Last Updated : Feb 16, 2021, 8:37 PM IST