అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వీడాలని భాజపా శ్రేణులు జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వీడాలి' - Gadwal bjp news
జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద భాజపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి వీడాలి'
ప్లకార్డులు పట్టుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీళ్ల విషయంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని, ఆర్డీఎస్, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి ధోరణి తెలుస్తోందని రామచంద్రారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చేశారు'