జోగులాంబ గద్వాల జిల్లాలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ ప్లకార్డుల పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
'లాక్డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి' - latest news of jogulambha
లాక్డౌన్ సమయంలోని మూడు నెలల విద్యుత్ బిల్లులను ఒకేసారి బలవంతంగా వసూలు చేయడం ప్రభుత్వానికి తగదని భాజపా నేతలు ఆరోపించారు. గద్వాల విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
లాక్డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి
ఒక సామాన్యునికి 4 వేల రూపాయలు విద్యుత్ బిల్లు వస్తే ఏ విధంగా వారు కట్టుకోవాలి భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి ప్రశ్నించాడు. వెంటనే ప్రభుత్వం విద్యుత్ బిల్లులు రద్దు చేయకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన