తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మహత్యలు కావు అవి ప్రభుత్వ హత్యలే: అరుణ - bjp

ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్​ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో గద్వాల జిల్లా కలెక్టరేట్​ ముట్టడికి యత్నించిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

dk-aruna-

By

Published : Apr 30, 2019, 4:46 PM IST

ఇంటర్​ బోర్డు వైఫల్యాలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని భాజపా నేత డీకే అరుణ డిమాండ్​ చేశారు. గద్వాల జిల్లాలోని కలెక్టరేట్​ ముట్టడికి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణా​కు తరలించారు. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.

గద్వాల కలెక్టరేట్​ ముట్టడికి భాజపా యత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details