తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి అంత్యక్రియలకు వెళ్లారు.. తిరిగొచ్చేసరికే ఇల్లు గుల్ల చేశారు! - ఐజలో భారీ దొంగతనం

తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ.3.2 లక్షల నగదు, మూడు తులాల బంగారం, రెండు కడియాలు దొంగతనం అయినట్లు బాధితుడు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Big theft at Ieja municipality in jogulamba gadwal district
తండ్రి అంత్యక్రియలకు వెళితే.. ఇల్లు గుల్ల!

By

Published : Jun 25, 2020, 9:56 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి ఆదివారం తండ్రి అంత్యక్రియలకు గట్టు మండలం మల్లంపల్లికి వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు జిల్లా నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో సోదాలు నిర్వహించారు. రూ.3.2 లక్షల నగదు, మూడు తులాల బంగారం, రెండు కడియాలు దొంగతనం అయినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details