జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు దగ్గర నిషేధిత గడ్డి మందును అధికారులు పట్టుకున్నారు. శాంతినగర్ నుంచి కర్నూల్‌కు ద్విచక్ర వాహనంపై నిషేధిత గ్లైపోసైట్ను అధికారులు పట్టుకున్నారు. సుమారు రూ.14 వేల 800 విలువైన 240 ప్యాకెట్లను వ్యవసాయ అధికారులు, పోలీసులు పట్టుకుని ఉండవెల్లి ఠాణాకు తరలించారు.
నిషేధిత గడ్డిమందు, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - Illegal transportation of banned grass medicine
జోగులాంబ గద్వాల జిల్లాలోని వేరువేరు ప్రాంతాల్లో నిషేధిత గడ్డి మందు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు 14 వేల రూపాయల విలువైన గడ్డి మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిషేధిత గడ్డిమందు, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
మరోవైపు అయిజ మండలం మూగోనిపల్లెలో అక్రమంగా నిలువ ఉంచిన 140 కేజీల నకిలి పత్తివిత్తనాలను వ్యవసాయ అధికారులు, పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
TAGGED:
Crime news